Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఆర్డీఓగా ఎల్.కిశోర్‌కుమార్ ఉన్నతాధికారిగా పదోన్నతి పొందడం అభినందనీయమని కోదాడ పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల రామారావు అన్నారు.బుధవారం పట్టణంలో ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్డీఓను ఘనంగా సన్మానించారు.కోదాడ రెవెన్యూ డివిజన్లో అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉత్తమమైన అధికారిగా కిషోర్ కుమార్ మంచి పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నారని కొనియాడారు.భవిష్యత్‌లో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా తిరిగి సూర్యాపేట జిల్లాకు వారు నియామకం కావాలని, వారి సేవలు మరింతకాలం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలన్నారు.అనంతరం వారిని శాలువా,పూలబొకేతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మెన్ బుడిగం నరేష్, డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌రావు, సీఈఓ మందా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.