Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీ ఎదుట మోకాళ్ళపై కూర్చున్న కార్మికులు
- యాజమాన్యం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం...
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికులు యాజమాన్యం నూతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె బుధవారం ఏడవ రోజుకు చేరుకుంది.కార్మికులు మోకాళ్లపై కూర్చుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రతిష్ట ఇండిస్టీస్ యజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు.కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పని చేయించుకుంటున్నారని విమర్శించారు.రెండేండ్లుగా బోనస్ ఇవ్వకుండా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తుందని అన్నారు. నూతన ఒప్పందం చేసుకోవాలని కార్మికులు వేడుకున్నా కూడా యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.వెంటనే క్షణమే యాజమాన్యం స్పందించి కార్మికులతో నూతన ఓప్పందం చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, ప్రతిష్ట ఇండిస్టీస్ యూనియన్ ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు దూసరివెంకటేశం, సత్యనారాయణ, భిక్షపతి,బుచ్చమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.