Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ
నవతెలంగాణ-కోదాడరూరల్
వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ అన్నారు. బుధవారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అక్టోబర్ 1 ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంను పురస్కరించుకొని ఈనెల 24 నుండి జరుగుతున్న వారోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.వయవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు.ఈ సందర్భంగా కోదాడ, హుజూర్నగర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యారమ్స్, చెస్, పాటలు, పద్యాల క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య వృద్ధులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత సీనియర్ సిటిజన్స్ సమైక్య కార్యవర్గ సభ్యులు రావెళ్లసీతారామయ్య, డివిజన్ అధ్యక్షులు గడ్డంనర్సయ్య, బొల్లు రాంబాబు, యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు,ఐసీడీఎస్ ఆఫీసర్ చంద్రిక, ధర్మోరి వెంకటేశ్వర్లు, ఫీల్డ్ ఆఫీసర్ వినోద్‌కుమార్,లక్ష్మీనర్సయ్య, వెంకటేశ్వరరావు, బ్రమరాంభ, భిక్షం, నర్సయ్య పాల్గొన్నారు.