Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఆడబిడ్డనైనా నన్ను గెలిపించండి
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెం, పంతంగి గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె మాట్లాడారు. మునుగోడులో ఉప ఎన్నిక రావడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలే కారణమని విమర్శించారు. 2018లో గెలిపించిన మునుగోడు ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. దేశంలోని ప్రజలపై భారాలు వేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ పార్టీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే అయితే రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బిజెపి పార్టీకి మూడో స్థానమే దక్కుతుందని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి దండెం రామ్ రెడ్డి, డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రామచంద్రం, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తూర్పుంటిరవి, కాంగ్రెస్ నాయకులు కడగంచి వెంకటేష్, జనార్ధన్, నారాయణ, బత్తుల శ్రీహరి, బోయ దేవేందర్, శ్యామ్, మల్కాపురం నరసింహ, రాచకొండ భార్గవ్, శ్రీను, కొంతం పద్మ, జయమ్మ, రాధిక తదితరులు పాల్గొన్నారు.