Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్
2016 సంబంధించిన వేతనాల జీవోను సవరించి పెరుగుతున్న ధరలకుఅనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాలలో కూడా ఉపాధిహామీ చట్టం ప్రవేశపెట్టి కూలీలకు, పేదలకు పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.బుధవారం మండలపరిధిలోని ఏపూర్ గ్రామంలో ఆ సంఘం మండలఐదవ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో కోటి మంది వ్యవసాయ కూలీలు రేక్కాడితే డొక్కాడని పరిస్థితులలో పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు.మోడీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వ్యవసాయ కూలీలు, పేదలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని కోరారు. అంతకుముందు మహాసభల ప్రారంభ సూచికంగా వ్యవసాయకార్మిక సంఘం జెండాను సీనియర్ నాయకురాలు బొప్పాని కనకమ్మ ఆవిష్కరించారు.ఈ మహాసభకు అధ్యక్షవర్గంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు ఎడ్ల నవనీత,బోయిల సాంబయ్య వ్యవహరించారు.మూడేండ్లకాలంలో మండలంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమాలను పోరాటాలను సమీక్షిస్తూ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు నివేదికను ప్రవేశపెట్టారు.ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అవిరే అప్పయ్య,వ్యవసాయకార్మికసంఘం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు , సీఐటీయూ మండలకన్వీనర్ యాతాకుల వెంకన్న, కల్లుగీత కార్మిక సంఘం మండల బెల్లంకొండ ఇస్తారి,డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు సానబోయినఉపేందర్, నాయకులు సోమిరెడ్డి దామోదర్‌రెడ్డి, నూకలగిరి ప్రసాద్‌రెడ్డి, తండ చంద్రయ్య పాల్గొన్నారు.