Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటిసందీప్రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అన్నారు.మండలంలోని మర్యాల గ్రామంలో ఎమ్మెల్సీ ప్రత్యేక నిధులనుండి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నూతన పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలోని వివిధ గ్రామాలలో 60 కమ్యూనిటీ , అంగన్వాడి భవనాలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను నిర్మాణానికి నిధులు కేటాయించానని1960 సంవత్సరంలో ఇదే గ్రామంలో ఉపాధ్యాయ వత్తిగా పనిచేసానని గుర్తు చేశారు. నాడు పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దానని మర్యాల గ్రామానికి తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.అనంతరం మహిళలకు బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్‌గౌడ్,ఎంపీటీసీ అనిత కావ్య ఈశ్వర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ బాలనర్సింహ, మండలఅధ్యక్షుడు పోలగాని వెంకటేష్‌గౌడ్,కో ఆప్షన్ సభ్యుడు ఆదిల్, ఉపసర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు అన్నారం గణేష్, రాజుకుమార్, మమత, నవనీత, అండాలు, కోఆప్షన్ సభ్యులు ఈదులకంటి రాజిరెడ్డి, ముద్దం ఉదరురెడ్డి, మండల నాయకులు ప్యారారం రాములు, నర్సింహ, తూముకుంట సాయి, ఎస్కె.కలీం, బొమ్మలరామారం ఉపసర్పంచ్ జూపల్లి భరత్, మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.