Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
సీఎం కేసీఆర్ హయాంలోనే దళితుల అభివృద్ధి జరుగుతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.బుధవారం మండలంలోని ఎల్లగిరి గ్రామంలో దళితవాడలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితులను ధనవంతులను చేయడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం దళితబంధు తీసుకొచ్చామన్నారు.మనువాద విధానాలను అనుసరిస్తున్న బీజేపీ దళితుల కోసం చేసిందేమీ లేదన్నారు.మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమని జోస్యంచెప్పారు.టీఆర్ఎస్ మునుగోడులో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయమార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిరికటి నిరంజన్, గ్రామ సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, గ్రామఅధ్యక్షులు రెక్కల బాలకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు నారెడ్డి అభినందన్‌రెడ్డి, ఇబ్రహీం పాల్గొన్నారు.