Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
పురపాలక కేంద్రంలోని చేనేత సహకార సంఘం చేనేత కార్మికుల గృహాలు. హ్యాండ్లూమ్ పార్క్ లోని చేనేత ఎగ్జామినేషన్ బుధవారం సందర్శించిన ఒరిస్సా రాష్ట్ర టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ మినిస్టర్ రితాసాహు సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికుల కళా నైపుణ్యం ఎంతోగొప్పదని కొనియాడారు.చేనేత వస్త్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగానూతన డిజైన్లను మార్కెట్లోకి తీసుకురావాలన్నారు.ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, తెలంగాణ చేనేత జౌళి శాఖ సంచాలకులు ఇందుమతి, ఒరిస్సా రాష్ట్ర ఉప సంచాలకులు మధుస్మిత,తెలంగాణ రాష్ట్ర ఉప సంచాలకులు వెంకటేష్,సహాయ సంచాలకులు, విద్యాసాగర్ పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.