Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
రాచకొండలో గిరిజనుల భూములకు పట్టాలు ఇచ్చేవరకు ఊరుకోమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.తరతరాలుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు ఆన్లైన్లో పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. సాగు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఈ ప్రాంత గిరిజనులను బస్సుల్లో తీసుకెళ్ళి హైదరాబాద్ లోని సేవాలాల్ భవనం చూపించడం సరికాదన్నారు.బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా బుధవారం125వ రోజు వెంకంబావి తండా,తుంబాయితండా, రాచకొండ,కడీల బాయితండా, ఐదుదోనలతండా,ఏడు బోనాలతండాలో పర్యటించారు. రాచకొండలోని లక్ష్మీనరసింహస్వామి ,స్వయంభు శంభులింగేశ్వ రాలయాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ విద్య ద్వారానే పేద గిరిజనుల బతుకులు మారుతాయ న్నారు.గిరిజన బిడ్డలను డాక్టర్లు ఇంజనీర్లుగా తయారుచేయాలని డిమాండ్ చేశారు.పోడుభూములకు పట్టాలిస్తామని ప్రకటించి,ఎందుకివ్వడం లేదన్నారు.అటవీ అధికారులకు, ప్రభుత్వానికి పేదల భూములే కనిపిస్తున్నాయా?అటవీ ప్రాంతంలోని ధనవంతులకు మాత్రం పట్టాలు ఎలా వచ్చాయన్నారు.రామోజీ ఫిల్మ్ సిటి భూములన్ని ప్రభుత్వ,అటవీ భూములు కాదా అని నిలదీశారు.అటవీ అధికారులు ఆ భూముల్లో కంచె వేయగలరా అని ప్రశ్నించారు..మేమే రాజకీయాల్లోకి సంపదకోసం రాలేదని,పేదలకు సంపదను పంచివ్వడానికే రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు.గిరిజన తండాల ప్రజలు హైదరాబాద్ లో కూలీలుగా,ఆటో డ్రైవర్లుగా,పనిచేస్తున్నారని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.యాత్రలో పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్‌చౌహాన్,జిల్లా నాయకులు ఏర్పుల అర్జున్,మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి ఐతరాజు అబేందర్,మహిళా కన్వీనర్ కత్తుల పద్మ,పోకల ఎలిజబెత్, శంకరాచారి,రమావత్ రమేశ్‌నాయక్, మహేందర్‌నాయక్, కత్తుల నర్సింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.