Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
గ్రామాల సర్వతోముఖఅభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని గణపవరంలో ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు,బతుకమ్మ చీరలను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు..అనంతరం కొండపల్లి రవికుమార్ జ్ఞాపకార్థం నిర్మిస్తున్న ఆసరా భవన్కు శంకుస్థాపన చేశారు.ఎమ్మెల్యే నిధులనుండి రూ.5 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు.పోతుగంటి కనకయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు పోతుగంటి సోమేశ్వరరావు వెటర్నరీ హాస్పిటల్ కోసం 300 గజాల స్దలాన్ని హాస్పటల్ కోసం విరాళంగా అందించారు.భవన నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు.సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించి, గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, మునగాల,గణపవరం, తాడ్వాయి, ఆకుపాముల సింగిల్ విండో చైర్మెన్లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, తొగరు సీతారాములు, వల్లపురెడ్డి రామిరెడ్డి, సర్పంచ్ కొండపల్లి విజయమ్మ, నర్సింహారావు, నాయకులు నల్లపాటి శ్రీనివాస్ అజరుకుమార్, టీఆర్ఎస్ మండల అ ద్యక్ష కార్యదర్శులు తొగరు రమేష్, ఎలకా వెంకట్రెడ్డి, నాయకులు గన్నా నర్సింహారావు, ఎల్పీ రామయ్య, గవిని శ్రీనివాస్, కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జితేందర్ రెడ్డి, పాల్గొన్నారు.