Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని స్వయం సహాయక సంఘాల సమాఖ్య సాధారణ సమావేశం సర్వజన మహాసభకు ముఖ్యఅతిధిగా ఎంపీపీ హాజరై మాట్లాడారు.మహిళల ఆర్ధికాభివృద్ధికి స్వయం సహాయకసంఘాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.గ్రామీణప్రాంతాలకు చెందిన మహిళలే కాకుండా పట్టణ ప్రాంతాల మహిళలు సైతం స్వయం సహాయకసంఘాల్లో సభ్యులుగా చేరి వ్యక్తిగత బృందాల ద్వారా రుణసదుపాయం పొంది స్వయంఉపాధి అవకాశాలు కల్పించుకుని ఆర్దికంగా బలోపేతం కావాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ లింకేజీలో అత్యధికంగా రుణాలు అందించిన కూచిపూడి గ్రామ వోఓఏ చిన్నపంగు జ్యోతికి, మరియు స్త్రీ నిధిలో ముందంజలో ఉన్న తొగర్రాయి వోఓఏ నాగేంద్రలకు ఘనంగా సన్మానం చేశారు.అనంతరం మహిళాసంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ కిరణ్కుమార్, ఏపీఎం వీరబాబు, డీపీఎం లక్ష్మీనారాయణ, సంఘబంధాల సభ్యులు, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.