Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకుల పరామర్శ
నవతెలంగాణ-కేతేపల్లి
కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీను తల్లి రాచకొండ జానకమ్మ (68) అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం గుడివాడ గ్రామంలో భౌతిక దేహానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ వెంకన్నలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ, నకిరేకల్ పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, వంటే పాక కృష్ణ, గునుగుంట్ల బుచ్చి రాములు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ
రాచకొండ జానకమ్మ మృతదేహంపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో గ్రామ సర్పంచ్ కట్ట శ్రవణ్ కుమార్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడి,్డ నకిరేకల్ జెడ్పిటిసి సభ్యులు మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, నకిరేకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మురారి శెట్టి కృష్ణమూర్తి, మాజీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.
కాంగ్రెస్ నాయకుల పరామర్శ..
రాచకొండ జానకమ్మ మృతదేహంపౖౖె టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షేక్ లతీఫ్, ఎంపీటీసీ గాజుల ప్రమీల, ప్రభాకర్, రాచకొండ లింగయ్య, కాంగ్రెస్ నాయకులు జగన్నాధం, వలిగొండ రవి, యం.డి యూసుఫ్ , పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.