Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించే వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్టు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆస్పత్రిలో పలువురు రోగులను కలిసి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి భవనం శిథిలవస్థకు చేరుకోవడంతో పెచ్చులు ఊడిపోతున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కంటే అదనంగా ఉన్నారన్నారు. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నారని రెగ్యులర్ చేస్తామని తెలిపారు. నూతన ఆస్పత్రి భవన నిర్మాణానికి అనుమతులు లభించాయని, త్వరలో నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రి నిర్మించే స్థలంలో ఉన్న భూమికి ఎలాంటి ఇబ్బందులు లేవని సాయిల్ పరీక్షలు నిర్వహించామని, వాటికి అనుమతులు వచ్చాయన్నారు. ఆయన వెంట డిసిహెచ్ మాతృనాయక్, ఆస్పత్రి సూపరిండెంట్ జి. శ్రీనాథ్ నాయుడు, సిబ్బంది తదితరులున్నారు.