Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తి యువతకు ఆదర్శమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు కామ్రేడ్ షాహిద్ భగత్‌సింగ్ 115వ జయంతి సందర్భంగా నర్సింగ్ బట్ల గ్రామ భగత్‌సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం 23సంవత్సరాల వయస్సులో చిరునవ్వు నవ్వుతూ, ఉరి కోయ్యలను ముద్దాడి ప్రాణాలను అర్పించిన మహనీయుడని కొనియాడారు. భగత్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్‌సింగ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మెన్ గోలి అమరేందర్ రెడ్డి, డీవైసీ ప్రవీణ్ సింగ్, నర్సింగ్ పట్ల మాజీ సర్పంచ్ ముక్కాముల యాదయ్య, ఎంవిఎన్ ట్రస్ట్ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్ పోలే సత్యనారా యణ, శ్రీనివాస్ రెడ్డి, భగత్ సింగ్ యువజన సంఘం, నర్సింగ్ బట్ల యువకులు చామకూరి మహేష్, బల్లెం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.