Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
రసాయన కర్మాగారాన్ని అడ్డుకుంటామని, పరిసర గ్రామాల ప్రజలు అవగాహన కల్పించిన తరువాతే రసాయన కర్మాగారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. లేని పక్షంలో వచ్చే నెల 10 వ తేదీన వాడపల్లిలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు. మండలంలోని వాడపల్లి శివారులో రసాయన కర్మాగారం నిర్మించనున్న ప్రదేశాన్ని బుధవారం పరిశీలించిన అనంతరం అయన మాట్లాడారు. దామరచర్లలో గతంలో డెక్కన్ క్రోమేట్ కర్మాగారం సృష్టించిన బీభత్సం ప్రజలు మరచిపోలేదన్నారు. వారు వదిలి వెళ్ళిన వ్యర్థాల కారణంగా భూమి, నీరు కలుషితమయ్యాని, పశువులు చనిపోనట్లు చెప్పారు. దీన్ని మరువక ముందే వాడపల్లి వద్ద సోడియం శాఖారియా, ఫిరోలైట్ తయారీ కర్మాగారం ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురైతున్నట్లు చెప్పారు. పైగా కృష్ణా నది కూడా సమీపంలో ఉండడంతో త్రాగునీరు కూడా కలుషితం అవుతుందేమోనని ప్రజలు భావిస్తున్నట్టు తెలిపారు. కర్మాగారం వాళ్ళు పరిసర గ్రామాలలో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ , డివిజన్ నాయకులు గౌతమ్‌రెడ్డి, మండల కార్యదర్శి వినోద్, పాపానాయక్, దాయానంద్, ఖాజా మొయినుద్దీన్, బాల సైదులు, తదితరులు పాల్గొన్నారు.