Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
మండల పరిధిలోని జమస్థాన్పల్లి గ్రామంలో 39 మంది దళితులకు మంజూ రౖన దళిత బంధు పథకంపై బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి విచారణ చేశారు. లబ్ధిదా రులు దళితబంధు నిధులు కేటాయించిన పరికరాలను వాహనాలను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ఆర్థికంగా బలోపితం అయ్యేందుకు సహకరించాలని కోరారు. లబ్ధిదారులు నెలసరి 30 వేలు సంపాదించే దిశగా పరికరాలను కొనుగోలు చేసుకోవాలన్నారు. అధికారులు లబ్ధిదారుల పట్ల తండ్రిలా వ్యవహరించాలన్నారు. ఈ పథకం నిధులను దుర్వినియోగం పరచకుండా భవిష్యత్తులో ఆర్థికంగా నిలబడేందుకు వినియోగించుకోవాలన్నారు. నల్లగొండ జిల్లాకు 517 మందికి దళిత బంధు మంజూరయ్యేనట్లు తెలిపారు. లబ్ధిదారులు కొనుగోలు చేసిన యూనిట్లపై అధికారులు కంపెనీలు శిక్షణ కల్పించి వారిని ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఏడి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ పంతంగి పద్మా స్వామిగౌడ్, కార్యదర్శి సరిత, ఆర్ఐ దుర్గా మహేశ్వరి, ఉప సర్పంచ్ రాధ, కోఆప్షన్ సభ్యులు, దళిత బంధు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.