Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జిగా రాంపాక బాబును ఎన్నుకున్నామని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి పరుశరాములు తెలిపారు.బుదవారం మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు వంగ పెళ్లి, శ్రీనువాస్ సూచన మేరకునియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి సూరయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నామన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలు అన్ని కమిటీలు నిర్వహించి,ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు.అర్హులైన అందరికీ దళితబంధు ఇవ్వాలని కోరారు.అదేవిధంగా మద్దిరాల మండల మహిళా ఇన్చార్జిగా రాంపాక మరియమ్మను వీరి సమక్షంలో ఎన్నుకున్నారు ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి గంగాధరిరమణ, రాంపాక శైలజ, వంగూరివినరు, రాంపాక ఉపేందర్, వంగూరి శ్యాంసన్, కోడిశాల మహేందర్, యువరాజ్, గోల్కొండ శ్రావణ్ పాల్గొన్నారు.