Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలంలోని తాటిపాముల గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి, పత్తి పంటలలో సస్యరక్షణ చర్యలపై రైతులకు ఒక్కరోజు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కృషి విజ్ఞానకేంద్రం కంపసాగర్ శాస్త్రవేత్త టి.భరత్ రైతుల పత్తి, వరి పంటలను పరిశీలించారు.పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు.ప్రస్తుతం పత్తి పంట గూడ దశలో ఉందన్నారు.సూక్ష్మ పోషకాలైన ఆగ్రోమిన్ మ్యాక్స్, మల్టీ-కే (13.0.45) కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మెగ్నిషియంలోపంతో పత్తి మొక్క ముదురుఆకుల అంచులు పసుపురంగులో మారి తర్వాత ఎర్రబడి రాలిపోతాయన్నారు.దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియంసల్ఫేట్ కలిపి పంటపై వారం పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని తెలిపారు.ప్రతికూల పరిస్థితులలో(తేమ/బెట్ట) మొక్కల జీవనప్రక్రియలో వచ్చే మార్పులతో పత్తిలో గూడ, పూత, పిందెరాలడం జరుగుతుందన్నారు.దీని నివారణకు ప్లానోఫిక్స్(ఎస్ఏఏ.10పపీపీ) ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలన్నారు.ప్లానోఫిక్స్ను విడిగా కానీ లేదా లీటరు నీటికి 20 గ్రాముల డీఏపీ లేదా యూరియాద్రావణంలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.వరి పంటలో సుడిదోమ గమనించినట్టయితే దీని నివారణకు తొలిదశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని కోరారు.ఉధృతి ఎక్కువగా ఉంటే పైమెట్రో జైన్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.వరిలో దోమనివారణకు పురుగుమందులు పిచికారీ చేసే ముందు పొలంలో నీటిని తగ్గించి పాయలు తీసి మొక్కలమొదళ్లపై పడేవిధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయఅధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకట్రెడ్డి, సర్పంచ్ ఎర్ర శోభశ్రీను, ఎంపీటీసీ కొర్న ప్రవీణ్, ఉపసర్పంచ్ నాయిని మల్లయ్య, గ్రామ రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ ఐల ఉపేందర్, రైతులు కారుపోతుల అంజయ్య, సోమయ్య, జేమ్స్, రాములు, కొమరయ్య పాల్గొన్నారు.
ఆత్మకూర్ఎస్ :మండలంలోని ఎనుబాముల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి అధికసాంద్రత, పత్తి పంటలపై రైతులకు గురువారం ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.కృషి విజ్ఞాన కేంద్రం కంపసాగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ (ఆగ్రనామి) ప్రస్తుతం వరి,పత్తి పంటలలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దివ్య, వ్యవసాయ విస్తరణఅధికారి శైలజ, రైతుబంధు సమితి గ్రామ సభ్యులు గన్న శ్రీను, రైతులు పాషా, తిరుపతయ్య, ఉప్పలాచారి పాల్గొన్నారు.
నాగారం : మండలపరిధిలోని బంగ్లా గ్రామంలో అధిక సాంద్రతపద్ధతిలో పత్తి సాగు చేస్తున్న పత్తి చేనులను కృషి విజ్ఞాన కేంద్రం కంపసాగర్ సేద్య విభాగం శాస్త్రవేత్త తేజువత్ భరత్ పరిశీలించారు.ఈ సందర్భంగా పంటలలో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వసీమా, జలగంశ్వేత, రైతులుసోమిరెడ్డి, ముకుందారెడ్డి, గంగయ్య, వెంకన్న, మల్లయ్య పాల్గొన్నారు.