Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 63 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు
- జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున్‌రావు
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాలో డైరెక్టర్ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.మల్లికార్జున్‌రావు గురువారం తనిఖీలు నిర్వహించారు.జిల్లావ్యాప్తంగా ప్రయివేట్ ఆస్పత్రిలో తనిఖీ కోసం జిల్లాలోని ప్రోగ్రాం అధికారులు డిప్యూటీ డీఎంహెచ్ఓలతో 6 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.ఈ బృందాలు జిల్లాలోని ప్రయివేట్ ఆస్పత్రులు,డయాగస్టిక్ సెంటర్లు,ఫిజియోథెరపీ క్లినిక్‌లు, క్లినికల్ ఎంపాస్మెంట్ చట్టం 2010 ప్రకారం అనుమతి పత్రాలు, ధరల పట్టిక డాక్టర్లు సిబ్బంది నియామకం ప్రభుత్వ నియమాల ప్రకారం పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేశారన్నారు.ఈ నెల 24 నుండి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 120 ఆస్పత్రులను తనిఖీ చేసి 63 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.మూడు ఆస్పత్రులను మూసివేయించామన్నారు.ఈ తనిఖీ ప్రక్రియ అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.