Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు
చివ్వెంల :గుండ్లకుంట చెరువు అలుగును ఆర్అండ్బీ రోడ్డు పక్కనుండి కాలువ తవ్వి సద్దల చెరువులోకి నీరు పోయే విధంగా ప్రభుత్వం వరద కాలువ నిర్మించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆ పార్టీ కుడకుడ శాఖ ఆధ్వర్యంలో గుండ్లకుంట చెరువు అలుగు ద్వారా ఒకటవ వార్డులోని ఇండ్లలోకి నీరు చేరి మునిగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం మూలంగా గుండ్లకుంట చెరువు పూర్తిగా నిండడం వల్ల అలుగుద్వారా నీళ్లు మొత్తం ఒకటో వార్డులోని మూడు బజార్లలో ప్రవహించడం మూలంగా ఇండ్లు మొత్తం నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.24 గంటల పాటు ఇండ్లలోకి నీరు రావడం మూలంగా నిత్యావసర వస్తువులు మొత్తం తడవడం వల్ల వంట చేసుకోక వార్డు ప్రజలు పస్తులు ఉంటున్నారన్నారు.ప్రభుత్వం వెంటనే నీట మునిగినఇండ్లను వెంటనే ఖాళీ చేయించి వారికి పురారువాసం సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.నీట మునిగిన ఇంటి యాజమాన్యులకు ప్రభుత్వం సహాయం కింద పదివేల రూపాయల ఆర్థికసాయం, బియ్యం , ఇతర అన్ని రకాల నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు మున్సిపల్ పాలకవర్గం వెంటనే తగిన నిధులు విడుదల చేసి వెంటనే గుండ్లకుంట చెరువు నుండి సద్దల చెరువు వరకు కాలువ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.లేనిపోంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు, వీరబోయిన రవి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య, కుడకుడ ఏరియా శాఖ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్, పట్టణ కమిటీసభ్యురాలు పిండిగా నాగమణి తదితరులు పాల్గొన్నారు.