Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
తెలంగాణ సంస్కృతి, సాంప్రాదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు పంపిణీ చేపట్టామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.గురువారం మండల్లంలోని రామన్నపేట,వెల్లంకి గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.అనంతరం 25 మంది లబ్దిదారులకు సీఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పున్నలక్ష్మీ, ఎంపీపీ కన్నేబోయిన జ్యోతి, వెల్లంకి సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి,ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, గొరిగే నర్సింహ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మందడి ఉదయరెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం,పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాలభిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పోతరాజు సాయికుమార్, ఉపసర్పంచ్ రవ్వ అనసూర్య, ఎడ్ల సురేందర్‌రెడ్డి, నాయకులు ఇడం శ్రీనివాస్, ఎడ్ల నరేందర్‌రెడ్డి, పాశం సతీష్‌రెడ్డి, కర్రె రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ :మండలకేంద్రంలో మహిళలకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మచీరలను ప్రభుత్వవిప్ గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, పుట్ల మల్లేశం, జి.శ్రీనివాస్, అనసూర్య, బేతిరాములు, పండరి శ్రీశైలం పాల్గొన్నారు.