Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పేదలపై భారం పెరిగిందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు బొల్లుయాదగిరి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) మోత్కూరు పట్టణ కమిటీ సమావేశం గురువారం చింతల కష్ణారెడ్డి అధ్యక్షత జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెంచారని విమర్శించారు.దీంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. వంటగ్యాస్ పై ఎత్తేసిన సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 12, 13వ తేదీల్లో మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, నాయకులు కూరెళ్ల నర్సింహ, రాచకొండ రాములమ్మ, కందుకూరి నర్సింహ, చేతరాశి నర్సింహ, లెంకల యాదగిరి, మెతుకు అంజయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.