Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
ఉదయం పది గంటలకి కూడా అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకో క తెరుచుకొని సంఘటన మండల పరిధిలోని వెంకేపల్లి తో పాటు పలు గ్రామాలలో అంగన్వాడీ కేంద్రలా లో శుక్రవారం చోటు చేసుకుంది ఉదయం 9 గంటలకు తెరవాల్సిన అంగన్వాడి కేంద్రాన్ని 10 గంటల వరకు కూడా తెరవలేదు కనీసం పిల్లలు కూడా కేంద్రానికి చేరుకోలేదు. అంటే ముందుగానే వీరు సెలవు ప్రకటించి ఉంటారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడి నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదని ,లబ్ధిదారులకు సరైన పోషక పదార్థాలను సరైన సమయంలో అంద చేయడం లేదని విశ్వసనీయ సమాచారం. కేంద్రాలను పర్యవేక్షకురాలు సందర్శించడం పోవడంతోనే అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యమై పోయి వాళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ స్పందించి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న పర్యవేక్షక కురాలి, అంగన్వాడి కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకొని అంగన్వాడీ కేంద్రాలను సమయపాలన పాటించే విధంగా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.