Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని పెండ్యాల మహేశ్వరి రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం అందుకుంది. నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ గ్రూప్లో విద్యనభ్యసించిన మహేశ్వరి 440 మార్కులకుగాను 436 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించింది. ఉత్తమ ర్యాంకు సాధించిన మహేశ్వరిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ జలీల్ అభినందిస్తూ ప్రతిభా పురస్కారంతోపాటు రూ. 20,000 నగదు ప్రోత్సవాన్ని అందజేశారు. ప్రతిభ పురస్కారం అందుకున్న మహేశ్వరిని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అభినందించారు.