Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాస్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నెలవారీ కార్యక్రమాలలో భాగంగా నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ,నల్లగొండ వారి సంయుక్త ఆద్వర్యం లో ప్రపంచ బధిరుల దినోత్సవం, క్షయ వ్యాధి నివారణ-నిర్మూలన లపై న్యాయ సేవ సదన్‌లో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బధిరుల చికిత్సవిదానలను గురించి డాక్టర్ వధువన్ సింహాద్రి వివరించారు. అలాగే క్ష్యయవ్యాధి వ్యాప్తి నివారణ, క్ష్యయ వ్యాధిగ్రస్తుల సంక్షేమం మొదలగు వాటిపై జిల్లా క్ష్యయవ్యాది నివారణ కేంద్ర అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారలీగల్ వాలంటరీలను ఉద్దేశించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. దీప్తి మాట్లాడుతూ జిల్లాలో గల మారుమూల గ్రామాలలో పై విషయాల గురించి ప్రజలకు తెలియజేసి వారిని వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సుభద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నామినేటెడ్ మెంబర్లు లెనిన్ బాబు, శంకరయ్య, భీమార్జున రెడ్డి, ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.