Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేట
వయో వృద్ధులను అందరు గౌరవించాలని వారి పోషణ సంరక్షణ చూడాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సంధర్భంగా జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ, అధ్వర్యంలో నిర్వహించిన వాకథన్ అవగాహన నడక ను స్థానిక గాంధి పార్క్ వద్ద ఆయన ప్రారంభించి మాట్లాడారు. వయోవృధ్ధులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ మాట్లాడుతూ వయో వృధ్ధుల హెల్ప్ లైన్ 14567 సేవలు ,వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం పై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. నేడు ఉదయం 12.00 గంటలకు సాయిబాబా గుడి ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడీపీవోలు శ్రీజ, చంద్రిక, సూపరింటెండెంట్ హుస్సేనా, సీనియర్ అసిస్టెంట్ చంద్ర శేఖర్, డీసీపీవో రవి కుమార్,ఎఫ్ఆర్ఓ వినోద్ కుమార్, సూపర్ వైజర్లు, వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు ఎన్. రామచంద్ర రెడ్డి, జి. విద్యాసాగర్, యస్, భాస్కరా చారీ,ఎస్ఏ.హమీద్ ఖాన్, ఎన్. చలమంద పాల్గొన్నారు.