Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నవతెలంగాణ -పాలకీడు
దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ప్రయోజనం పొందిన అర్హులు ఆర్థికంగా ఎదగాలనిఎమ్మెల్యే సైదిరెడ్డి సూచించారు. మండలంలోని కోమటికుంట గ్రామంలో ఎంపీడీవో వెంకటాచారి, సర్పంచ్ రామలక్ష్మమ్మల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు గేదెలు, గొర్రెలతో పాటు, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.లబ్దిదారులకు పాడి గేదెల పోషణ, గొర్రెల పెంపకం పై అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ జెడి శ్రీనివాసుని కోరారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే నినాదంతో పరిపాలన చేస్తుందన్నారు. దానిలో భాగంగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అవి పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఇంటి గడపకు చేరాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీదేవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు దర్గారావు, దేవి రెడ్డి వెంకటరెడ్డి, స్థానిక నాయకులు లక్ష్మీనారాయణ, తీగల వెంకటరెడ్డి, శేషి రెడ్డి, పసుపులేటి సైదులు, బిక్షం, ప్రేమ్ కుమార్, మరియదాసు, విజయ్, గోపాల్ నాయక్,మునగాల సైదిరెడ్డి,రామారావు పాల్గొన్నారు.