Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలలకే కూలిన పాఠశాల ప్రహరీ గోడ
నవతెలంగాణ -మోతె
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో నాలుగు నెలలకే గోడ కూలిపోయింది. మండల పరిధిలోని మామిండ్లగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల కొంత స్థలం, ప్రహరీ గోడ రోడ్డు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయింది. ఇందుకు రోడ్డు నిర్మాణ డిఎన్ఆర్ సంస్థ వారు పాఠశాలకు రూ.27 లక్షల నష్టపరిహారం చెల్లించారు. ఆ నిధులను పరిషత్ పాఠశాలకు మంజూరు చేయడంతో సర్పంచి మళ్లీ ప్రహరీ గోడ నిర్మించారని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రహరీ పునాది తొవ్వకుండా ప్రహరీ నిర్మించడంతో కూలిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో కాంట్రాక్టర్ సదరు ఏఈ వాటాలు ఎంత తీసుకున్నారని చర్చించుకుంటున్నారు.