Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్ పహాడ్
దేశాన్ని భాజపా ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని దేశ ప్రజలు కేసిఆర్ పరిపాలన కోరుకుంటున్నారని రాష్ట్ర ఉన్నత విద్య కమిటీ సభ్యులు, రాష్ట్ర టీిఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని, దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. దసరా పండుగ రోజున జాతీయ పార్టీని ప్రకటించే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారని అందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, జడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, సర్పంచులు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిట్టు నాగేశ్వరరావు, చెన్ను శ్రీనివాసరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, నాయకులు తూముల ఇంద్రసేనారావు, పొదిల నాగార్జున, దంతాల వెంకన్న, ఆవుల అంజయ్య, సముద్రాల రాంబాబు, ఒగ్గు గోపి, దాసరి శ్రీను, శోభన్ బాబు, కట్ల నాగార్జున, మామిడి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.