Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరిత, ఐడీిఎస్ సూపర్వైజర్ అంజమ్మ ,వెలుగు ఏపీిఎం రమణ , పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ..
భువనగిరి : శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను డాక్టర్ లింగా కిరణ్, పోత్నక్ ప్రమోద్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నాటి నుండి వస్తున్న తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిదర్శనమని కొనియాడారు. కళాశాల చైర్మెన్ గడ్డం శ్రీనివాస్,దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న బతుకమ్మ పండుగ ఆడబిడ్డలకు అందరికీ ఆదర్శనీయమని తెలపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పోతరాజు కృష్ణ వేంపల్లి కొండల్ రెడ్డి కొరటికంటే శ్రీధర్ గౌడ్ ఆకస్వామి కళాశాల వైస్ ప్రిన్సిపల్ మల్లేష్ అధ్యాపకులు మహేశ్వర్, చంద్రశేఖర్, సంతోష్, పరశురాం, శ్రీలత, శ్రావణి ప్రియాంక సోమరాజులు గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సాయిరాం పాల్గొన్నారు.
ఏడోరోజు సద్దుల బతుకమ్మ
గుండాల: మండల కేంద్రంలో శనివారం మహిళలుఏడో రోజు సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు.మహిళలు తంగేడి,బంతి,చామంతి రకరకాల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి అందులో గౌరమ్మ పెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం మహిళలు బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడుతూ సంబరాలలో మునిగి తేలారు.గుండాల గ్రామంలో పూర్వం నుంచి ఏడో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్,ఎంపీటీసీ కుంచాల సుశీల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.