Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
మండలంలోని తుక్కాపురం శివారులో నూతనంగా నిర్మిస్తున్న సిద్ధం రిసోర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీపై శనివారం పరిశ్రమల శాఖ మేనేజర్ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి విచారణ జరిపారు. కంపెనీ నిర్మాణం ఆపివేయాలని అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకే విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్ ,గ్రామస్తులందరూ కలిసి కంపెనీ నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. ఎట్టి పరిస్థితులను ఈ కంపెనీకి అనుమతి ఇయ్యొద్దని అధికారులకు విన్నవించారు. కాలుష్య కారకమైన మరొక కంపెనీ రోమ ఇండిస్టీపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లమాసు శారద సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ పుట్ట అరుణ వీరేష్ యాదవ్, నోముల మహేందర్ రెడ్డి, రాసాల మల్లయ్య, రత్నపురం శ్రీనివాస్, ఏడు మేకల మహేష్ యాదవ్, కంటం యాదేశ్, రాసాల వెంకటేష్, రత్నపురం సురేందర్, రాసాల గణేష్ ,రసాల శేఖర్ యాదవ్,రత్నపురం జనార్దన్, ముంత శివ శంకర్, గడసందుల నరసింహపురం శ్రీకాంత్, నల్లమాసు రమేష్, పుట్టా శివ, గోపగాని మహేందర్, వినరు పాల్గొన్నారు.