Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఉప ఎన్నికలు
- మునుగోడులో బీజేపీని ఓడించండి
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - భువనగిరి
మునుగోడు నియోజకవర్గంలో అనవసరపు ఎన్నికలు తీసుకొచ్చి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీజేపీని మునుగోడు ప్రజలు ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనవసరపు ఎన్నికలు తీసుకొచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. నియోజకవర్గంలో కులాల పేరుతో ,మతం పేరుతో విభజనలు తీసుకొచ్చి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారడన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. బీజేపీ మునుగోడు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య కులాల పేరుతో విచ్చినం చేసి పండుగల పేరుతో ఆకర్షించడం పిరికిపంద చర్యన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల పేరుతో, జీఎస్టీ పేరుతో భారాన్ని మోపిన విషయం మరిచిపోయి ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశం లాగా దక్షిణ భారతదేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో విచ్చిన్నం చేయాలనే కుట్రను కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ మునుగోడు నియోజవర్గం ఐక్యతకు నిదర్శంగా ఉందన్నారు. గతంలో కమ్యూనిస్టుల బలాన్ని నియోజవర్గ ప్రజలు చూపించారని తెలిపారు. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే బీజేపీని నియోజకవర్గ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, బొల్లు యాదగిరి,ఎండి.పాషా, బూరుగు కృష్ణారెడ్డి, పగిళ్ల లింగారెడ్డి, బబ్బురి పోశెట్టి, బొడ్డుపల్లి వెంకటేష్, గుంటోజు శ్రీనివాస్ చారి ,గంగాదేవి సైదులు ,బండారి నరసింహ, దొడ యాదిరెడ్డి, బొలగాని జయరాములు, రాచకొండ రాములమ్మ ,గడ్డం వెంకటేష్, ఎంఎ.ఇక్బాల్, వనం ఉపేందర్, పాల్గొన్నారు.