Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కార్యాలయాలు ప్రారంభం
- మండల ఏర్పాటుతో సంబరాలు
- జిల్లాలో 32కు చేరిన మండలాల సంఖ్య
నవతెలంగాణ-చండూరు
గట్టుప్పల ప్రజల కల ఫలించింది. ఆ గ్రామస్తులు, మరికొన్ని గ్రామాల ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటం నెరవేరింది. ఏడు గ్రామాలతో గట్టుప్పలను మండలంగా ప్రకటించారు. దీంతో నల్లగొండలో జిల్లాలో మండలాల సంఖ్య 32కు చేరింది. సుదీర్ఘ పోరాట ఫలితంగా మండలం ఏర్పాటు కావడంతో గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు.
2016 నుంచి పోరుబాట..2016లో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మొదటి ముసాయిదాలో 12 గ్రామాలతో గట్టుప్పల మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కొన్ని గ్రామాల ప్రజలు అభ్యంతరం తెలపడం వల్ల తుది జాబితాలో గట్టుప్పల్ మండలాన్ని చేర్చలేదు. అప్పటి నుంచి గట్టుప్పల గ్రామంలో యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు సైతం నిర్వహించారు. వివిధ ఘటనల్లో 20 మందికిపైగా యువకులపై కేసులు నమోదయ్యాయి. గ్రామస్తులు రెండేళ్లపాటు దసరా, దీపావళి పండుగలను సైతం జరుపుకోలేదు. మండల సాధన కమిటీని ఏర్పాటు చేసుకుని 892 రోజులు నిరసనలు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీలో నిలబడిన అన్ని పార్టీల అభ్యర్థులు వినతి మేరకు నిరసన విరమించుకున్నారు.
2018లో ముఖ్యమంత్రి హామీ... 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చండూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టుప్పల మండలం ఏర్పాటు ఖాయమని చెప్పారు. ఎన్నికల తర్వాత చండూరులో 2019 సంవత్సరంలో జరిగిన ప్రగతి సభలో సైతం మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి గట్టుప్పల మండలంపై స్పష్టత ఇచ్చారు. ఆనాటి నుంచి వారి హామీలు అమలు కాకపోవడంతో గ్రామస్తులు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు వారి కల సాకారమైంది. మండలం ఏర్పాటు కావడంతో ముందుగా రెవెన్యూ, పోలీస్ శాఖలకు సంబం ధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన కార్యాల యాలను అంచలంచలుగా ఏర్పాటు చేస్తారు. నేడు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
గట్టుపల్‌లో కలిసిన గ్రామాలు ఇవే...గట్టుపల్ మండలాన్ని ఎనిమిది గ్రామాలను కలుపుతూ జీవో విడుదల చేయగా కొండాపురం గ్రామస్తులు గట్టుప్పల్ వద్దు చండూరు మండలంలోనే ఉండాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేయడంతో గ్రామాన్ని రద్దుచేశారు. తుది జాబితాలో 7 గ్రామాలతో గట్టుపల్ను చిన్న మండలంలో ప్రకటించారు. చండూర్ మండలం నుంచి తేరాట్పల్లి, గట్టుపల, షేర్గూడెం, కమ్మగూడెం, మర్రిగూడ మండలం నుంచి అంతంపేట, నమపురం, మునుగోడు మండలం నుండి వేల్మా కన్నె గ్రామంతో మండలం ఏర్పాటు చేశారు. ఈ మండలంలో మొత్తం 23 వేల జనాభా 15,500 ఓటర్లు ఉన్నారు. కొత్త మండలాన్ని నల్లగొండ జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
గట్టుపల్ మండలం ఏర్పాటు చేసినందుకుగాను సీఎం కెేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆఫీసులు ఓపెన్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించు కుందాం. గెలుపును కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం. గట్టుపల్ ప్రజలు ఒక్కతాటిపై ఉండి ముందుకు సాగుదాం.
కార్యాలయాలను ఏర్పాటు చేయాలి
- ఇదం రోజా(సర్పంచ్, గట్టుప్పల్)
మండలం తుది ప్రక టతో సంతోషం గా ఉంది. మా నాన్న ఇడెం కైలాసం మండలం ఏర్పాటు ఉద్యమంలో ఎంతో శ్రమించారు. కల సాకారమైంది. మండలం ఏర్పాటుకు సహకరించిన మంత్రి జగదీశ్ డ్డికి రుణపడి ఉంటాం. గ్రామస్తుల తరపున ప్రభుత్వానికి ధన్యావాదాలు, ఆఫీస్‌లు ఓపెన్ కావడం సంతోషంగా ఉంది.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి గట్టుపల్ కు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి.
నేడు తాసిల్దార్, పోలీస్ స్టేషన్ ఆఫీసులు ప్రారంభం
-గణేష్(తహశీల్దార్)
నేడు గట్టుపల్ మండలం కేంద్రంలో నూతనంగా తహ శీల్దార్, పోలీస్ స్టేషన్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభిం చను న్నారు. మిగిలిన ఆఫీసులు అంచెలంచెలుగా ఓపెన్ చేస్తాం.