Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
భారత దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పంకజ్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని పలువుల గ్రామంలో రైతుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులను కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 కన్న ముందు కరెంట్ ఏవిధంగా ఉంది ఇప్పుడు కరెంట్ ఏ విధంగా వస్తుందో రైతులకు తెలుసని, కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెడుతా అని వస్తున్నారన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంట్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలొనే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంకజ్యాదవ్, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.