Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)లో వివిధ పార్టీల నాయకులు చేరిక
నవతెలంగాణ-మునుగోడు
ప్రజలకు అందాల్సిన అక్కుల సాధన కోసం ప్రభుత్వాలపై ప్రశ్నించే గొంతుకగా పనిచేసే సీపీఐ(ఎం)లో చేరేందుకు ప్రజలు అకర్షితులవుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మండలంలోని గూడపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజలపై భారం మోపేందుకు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజల నడ్డి విడిచే విధంగా పన్నులు విధిస్తున్నారని, కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతో పోరాడి తెచ్చుకున్న హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు కొమ్ముగాసే విధంగా చట్టాలను రూపొందించడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పార్టీ నియమాలు, నిర్మాణం గురించి చెప్పి కొత్తగా చేరిన సభ్యులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీ నిర్వహించే ప్రజా పోరాటాలలో భాగమై పార్టీ, ప్రజా శ్రేయస్సుకు పాటు పడాలని వారిని కోరారు. పార్టీలో రొమ్ముల సురేష్, పొట్ట లక్ష్మయ్య, దోర వెంకన్న, రొమ్ముల మహేష్, ఏర్పుల శ్రీను, గణిపల్లి వెంకన్న, దర్శనం లక్ష్మయ్య, దర్శనం పాండు, దర్శనం క్రిష్ణా, గాదె సైదులు, జిల్లా అంజయ్య, పగడాల శివలు చేరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, మండల నాయకులు యాసరాని శ్రీను, ఎస్. వీరమల్లు, యాట యాదయ్య, సాగర్ల మల్లేష్, వంటెపాక అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.