Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
మిషన్ భగీరథ కాంటాక్ట్ కార్మికుల కనీస వేతనాలు రూ. 26 వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం యూటీఎఫ్ కార్యాలయంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు లేక కడుపులు మాడాల్సిందేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి మంచినీళ్లు సరఫరా చేస్తూ ప్రజలు మన్నానలను పొందుతున్న మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, సెలవులు సక్రమంగా అమలు చేయకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి, అధ్యక్షులుగా జింజరాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్లకొండ శంకర్, ఉపాధ్యక్షులుగా సుంకరి సైదులు, బొజ్జ వెంకన్న, సింగం రమేష్, ప్రధాన కార్యదర్శిగా నేలపట్ల అశోక్, సహాయ కార్యదర్శిగా ఎన్. దాసు, వేముల సైదులు, నామ సైదులు, ప్రచార కార్యదర్శిగా కుడుతాల సైదులు, ఉయ్యాల మురళి, కోశాధికారిగా కర్నాటి వెంకన్న, సాంస్కృతిక కార్యదర్శిగా ఎర్రోళ్ల సాయిబాబు, సోషల్ మీడియా కన్వీనర్‌గా నీలం దుర్గాప్రసాద్, మొత్తం 25 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.