Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశభక్తి పేరుతో దేశ సంపద అమ్మడం
- అత్యధిక మెజార్టీతో బీజేపీని ఓడించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ
దేశభక్తి పేరుతో దేశ సంపదను హౌల్ సెల్గా అమ్మేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని, దేశానికి బీజేపీ ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలోసీపీఐ(ఎం) దేవరకొండ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు కష్టపడి దేశ సంపదను, ప్రభుత్వరంగ సంస్థ కంపెనీలను, తయారు చేసుకుంటే మోడీ సంతలో పెట్టి హౌలీ సెల్గా అమ్ముకుంటున్నారన్నారు. మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సర కాలంలో హద్దు పద్దు లేకుండా నిత్యవసర వస్తువుల ధరలు పెంచడం, జీఎస్టీ ద్వారా డీజిల్, పెట్రోల్, గ్యాస్ పెంచి సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులకు గురి చేశారన్నారు. మరోవైపు అప్పుల మీద అప్పులు తీసుకురావడం జరిగిందన్నారు. మోడీ ప్రధానమంత్రి కాకముందు దేశం 70 లక్షల కోట్లు అప్పు ఉంటే ప్రస్తుతం అప్పు రెట్టింపు అయ్యిందని తెలిపారు. వ్యవసాయ రంగం దెబ్బతిందని, రైతు వ్యతిరేక చట్టాలు తీసి మోడీ బోర్ల పడ్డారన్నారు. ఉపాధి హామీ పనులకు కోత పెట్టడం, 98 వేల కోట్ల నుండి 73 వేల కోట్లకు నిధులు కుదించడం, పని మనుషులను తగ్గించడం, బకాయిలు పెంచడం చేస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం వ్యాపార వస్తువుగా, కార్పొరేట్ చేతిలోకి వెళ్లి, సామాన్య ప్రజలకు అందుబాటులో లేవన్నారు. ప్రజలకు రక్షణ, మహిళలకు మరింత రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరచడం, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను దెబ్బతీస్తున్నా బీజేపీని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన, వార్తలు రాసిన వారి మీద సిబిఐ, ఈడి, దాడులు చేస్తూ లొంగదీసుకుంటుందని, వినని వారిపై కేసులు పెడుతుందని తెలిపారు. బీజేపీలో చేరితే నీతిమంతులు, చేరని వారు అవినీతి పరులు అంటూ ఆరోపణలు చేస్తారన్నారు. భారత్ మాతాకీ జై.. అంటూ భారత సంపదను అమ్మడం, మేడిన్ ఇండియా.. సెల్ ఆన్ ఇండియాగా మార్చరన్నారు. మత విద్వాంసాలను రెచ్చగొట్టడం, ప్రజలను ఐక్యత లేకుండా చేయడం, బిజెపి పనిగా పెట్టుకుందన్నారు. దేశ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకునేందుకు మరో స్వాతంత్ర పోరాటం చేసేందుకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, డబల్ బెడ్ ఇళ్లను, పోడు భూముల సమస్యలను, పెండింగ్ ప్రాజెక్టును, తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. నల్లగొండ, ఖమ్మం ,వరంగల్, జిల్లాలో బీజేపీకి పట్టులేదని, దృష్టిలో ఉంచుకొని ఉప ఎన్నిక ద్వారా లొంగదీసుకోవాలని చూస్తుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం, ప్రయోజనాలు పొందేందుక ఉప ఎన్నిక తీసుకువచ్చిందన్నారు. దేశ సంపదను కొద్దిమంది చేతులు పెట్టడం, మతపరమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం పనిచేస్తుందన్నారు. దేశాన్ని మింగే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో ఓడించాలని, టిఆర్ఎస్కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అనుసరించే విధానాలపై, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై సీఎం కేసీఆర్ పై కూడా ఒత్తిడి తెస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు నల్ల వెంకటయ్య, నాగటి నాగరాజు, బిజిలి లింగయ్య, బుడుగుళ్ల రాములు, నిమ్మల పద్మ, తోట రమణ ,పూల యాదయ్య ,కాశయ్య, జ్యోతి ,లలిత, నల్ల చిన్న వెంకటయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు బుడిగి వెంకటేశ్వర్లు, బి. వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.