Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రధాని మోడీ విఫలమయ్యారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు విమర్శించారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఆదివారం సీపీఎం గ్రామశాఖ సమావేశం వెండి యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెస్తామని, ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు, ధరల భారం తగ్గిస్తామని హామీలిచ్చి నెరవేర్చడం లేదన్నారు.ఈ సమావేశంలో గ్రామశాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు దడిపెల్లి ప్రభాకర్, కొంపెల్లి గంగయ్య, చింతకింది సోమరాజు, వడ్డెపల్లి లక్ష్మణ్, సైదులు, లచ్చయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.