Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహం, శాంతియుత మార్గాలు నేటు యువతకు ఆదర్శమని, ప్రతి ఒక్కరూ గాంధి మహాత్ముని బాటలో పయనించాలని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గాంధి మహాత్ముని చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జీడిభిక్షం, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ లక్ష్మీ, ఏపీఓ వెంకన్న, సీనియర్ అసిస్టెంట్లు,సీఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట:పట్టణంలోని 44వ వార్డులో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్,కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్‌గుప్తా గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్‌రెడ్డి, సేవాదళ్ కాంగ్రెస్ జిల్లా చీఫ్ ఆర్గనైజర్ ఆలేటిమాణిక్యం, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా కార్యదర్శి నాగుల వాసు, కార్యదర్శి అక్కెనపల్లి జానయ్య, జిల్లా అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, రెడ్ హౌస్ ఇన్చార్జి నరేందర్ నాయుడు, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నమయ్య రాము, చెరుకు రవికుమార్, చెరుకు రాము, కోడి శివ, జామాండ్ల సత్యనారాయణరెడ్డి, బండారి కష్ణ పాల్గొన్నారు.
పట్టణంలోని ఎంజీరోడ్డులో గల గాంధీ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతిల కార్యక్రమాలను ప్రభుత్వాలు అధికారికంగా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సందర్భంగా మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహం, శాంతియుత మార్గాలు నేటి యువతకు ఆదర్శమని, ప్రతి ఒక్కరూ గాంధి మహాత్ముని బాటలో పయనించాలని జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి శంకర్, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు.పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు యలగందుల సుదర్శన్, పాపాని యాదగిరి, యలగందుల వెంకటేశ్వర్లు, విజరు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరుఎస్: మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గాంధీ జయంతి నర్వహించారు.వీఆర్ఏలు గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు రజితసుధాకర్, గంపల సతీష్, బుద్ధం శేషమ్మ, తంగెళ్ల వీరారెడ్డి, తూడి లావణ్య నర్సింహారావు పాల్గొన్నారు.
తిరుమలగిరి: మండలకేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద లయన్స్ క్లబ్ అధ్యక్షులు జలగం రామచంద్రయ్యగౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ఆధ్వర్యంలో 153వ మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు.డీఎంహెచ్ఓ కోటాచలం గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మహబూబబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధర్, పాలెపు చంద్రశేఖర్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, కందుకూరు లక్ష్మయ్య లయన్స్ క్లబ్ కార్యదర్శి ఐత శ్రీనివాస్, కోశాధికారి సురేష్ కుమార్, సభ్యులు కృష్ణమాచారి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: మండలంలోని రావులపల్లి ఎక్స్రోడ్డుతండా సర్పంచ్ గుగులోతు వెంకన్న గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మీ, ఉపసర్పంచ్ భూక్యా శంకర్, వార్డు సభ్యులు దేవేందర్, శోభ, పాండు, గ్రామపంచాయతీసిబ్బంది వెంకన్న, దేవ్, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో గాంధీ జయంతి నిర్వహించారు.ఈ ఓడీఎఫ్ స్వచ్ఛ గ్రామపంచాయతీ తీర్మాణం చేశారు.అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భీంసింగ్నాయక్, సీనియర్ అసిస్టెంట్ విజరుకుమార్, జూనియర్ అసిస్టెంట్ జిలాని, టైఫిస్టు దశరథ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, ఈ పంచాయతీ ఆపరేటర్లు దిలీప్‌రెడ్డి, స్టాలిన్, గ్రామపంచాయతీలలో ఆయా గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మునగాల : ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక గాంధీపార్క్‌లో బాపూజీ విగ్రహానికి పలువురు పూలమాలలేసి నివాళులర్పించారు.పేదలకు మిఠాయిలు, పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా వైస్గవర్నర్ వంగవేటి వెంకటగురుమూర్తి, వాసవి క్లబ్ మండల అధ్యక్ష కార్యదర్శులు కాపర్తి మణికంఠకుమార్, చక్కా కిశోర్, ఆర్యవైశ్యసంఘం పెద్దలు పి.శ్రీనివాస్, నల్లపాటి శ్రీనివాస్, కందిబండ సత్యనారాయణ , అర్వపల్లి రామారావు,అర్వపల్లి శంకర్, వాసా శ్రీ నివాసరావు, మంగేష్, సంతోష్ పాల్గొన్నారు.
పాలకవీడు: మండలకేంద్రంలో గాంధీ జయంతి నిర్వహించారు.ఎంపీపీ గోపాల్‌నాయక్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అనంతప్రకాష్, ఆర్యవైశ్యసంఘం మండల అధ్యక్షుడు లక్ష్మయ్య,పీఏసీఎస్ చైర్మెన్ సత్యనారాయణరెడ్డి, బెట్టెతండా సర్పంచ్ మోతిలాల్‌నాయక్, వైస్‌ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్ పాల్గొన్నారు.
చివ్వెంల: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపీపీ ధరావత్ కుమారిబాబునాయక్ పూలమాలలేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ, ఎంపీఓ గోపి, సర్పంచ్ దొంగరి కోటేశ్వరరావు, టైపిస్టు మల్లేష్, జూనియర్ అసిస్టెంట్ దిలీప్, కంప్యూటర్ ఆపరేటరు కల్పన,టీఏలు రమాదేవి, ఉదయశ్రీ, విజయకుమార్, కార్యాలయ సభార్డినేట్లు వీరాసింగు, ప్రసాదు, ఎల్లమ్మ,జయంతి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జమీరోద్దీన్ గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, డీటీ శ్రీధర్, ఎంపీడీవో ఇందిరా, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అర్వపల్లి: మండలకేంద్రం, మండలంలోని వివిధ గ్రామాల్లో గాంధీ జయంతి నిర్వహించారు.ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రేణుకయాదవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండగాని సోమేష్‌గౌడ్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ రాజు, ఏపీఓ శైలజ పాల్గొన్నారు.
కోదాడరూరల్ : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను బస్టాండ్ సెంటర్లో ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగవీటి రామారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పారా సీతయ్య, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్లు షాబుద్దీన్, గంధం యాదగిరి, కర్రీ సుబ్బారావు, చింతలపాటి శ్రీనివాసరావు, ఆవు దొడ్డి ధనమూర్తి, బషీర్, బాల్‌రెడ్డి, బాగ్దాద్, బాజన్, పాలూరి సత్యనారాయణ, కంపాటి శ్రీను, బజాన్, షమీ, గార్లపాటి వీరారెడ్డి, బాబా, శోభన్, రజనీకాంత్, సైదిబాబు, దాదావలి, ముస్తఫా, దావల్ తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ :మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపీపీ నెమ్మాది భిక్షం పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్లు నాతాల జానకిరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు షేక్‌రఫీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాచేపల్లి భరత్, నాయకులు తూముల ఇంద్రసేనారావు, ఒగ్గు గోపి, ఇన్చార్జి ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, ఏపీఓ రవి పాల్గొన్నారు.