Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ రూరల్
ముఖ్యమంత్రి అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తానని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఆదివారం తో సమ్మె 70వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏలు రామగిరి గాంధీ బొమ్మ దగ్గర మౌన దీక్షిత్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ టిఆర్ఎస్ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షుడు బాలస్వామి, కె. నరేష్, గౌరవాధ్యక్షులు మారయ్య, జేఏసీ నల్లగొండ డివిజన్ చైర్మన్ స్వామి, శ్రీను, ఎస్.కె. లతీఫ్, జి.శంకర్, తదితరులు పాల్గొన్నారు.