Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
మండలపరిధిలోని కోటినాయక్తండాలో దోమల దాడిలో అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే...తండాకు చెందిన బానోతు సూర్తి (65). ఇంటి ముందు చేరిన వర్షపు నీటిలో దోమలు వృద్ధి చెందాయి.దోమలు కుట్టి జ్వరం సోకి అస్వస్థతకు గురై మృతి చెందింది.తండాల్లో మురుగుగుంతల్లో నీరు చేరి సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు.తండాలో ఇప్పటికే జ్వరాలు సోకిన వారిలో ధరావత్ తులచ్య, బి సక్రు, మౌనిక, బి.పాండు, నరహరి,మరికొంత మంది ఉన్నారు.వీరిలో కొందరు స్థానికంగా చికిత్స పొందుతుండగా మరికొందరు సూర్యాపేట జనరల్ హాస్పిటల్,ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.మృతురాలికి ఇద్దరుకుమారులు ,ఒక కుమార్తె ఉన్నారు.