Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఉపాధి కూలీ రేట్ల విషయంలో స్థానిక కూలీలకు, బీహార్ కూలీలకు మధ్య మాటల యుద్ధం పెరిగి కూలీల అడ్డా వద్ద రణరంగంగా మారింది. అది కాస్తా ఘర్షణకు దారితీయడంతో స్థానిక కూలీలపై బీహార్ కూలీలు రాళ్ళ వర్షం కురిపించిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని భాస్కర్ టాకీస్ అడ్డా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ వద్ద బీహార్ కూలీలు అడ్డా ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక కూలీలు భాస్కర్ టాకీస్ అడ్డాను ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలో జరిగే నిర్మాణ పనుల విషయంలో స్థానిక కూలీలకంటే బీహారీ కూలీలు తక్కువ రేటుకు పనిచేస్తున్నారని ఆగ్రహించిన స్థానిక కూలీలు ఆదివారం భాస్కర్ టాకీస్ సెంటర్ పై ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో బీహారీ కూలీలు స్థానిక కూలీలపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ గోపీ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను చెదరగొట్టారు. దాడికి పాల్పడ్డ 20 మంది బీహార్ కూలీలను అదపులోకి తీసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.