Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకొని సోమవారం స్థానిక వెంకట్రామయ్య చెరువు వద్ద ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా బతుకమ్మల నిమజ్జనం కోసం అధికారులు, స్థానిక నాయకులు సోమవారం ఏర్పాట్లు చేశారు.స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాలతో బట్టే కృష్ణమూర్తి బావి నుండి చెరువు కట్ట వరకు యంత్రాల సహకారంతో చెత్తాచెదారం, కంప చెట్లు లేకుండా శుభపరిచారు. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి నూతనంగా విద్యుత్తు తీగలను అమర్చి లైటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు బతుకమ్మలను టార్చ్ లైట్లు, బైక్ లైట్ల వెలుతురు సహాయంతో చెరువులో వేస్తూ చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయము నాడు స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తేవడంతో ఈ ఏర్పాటు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు పోతరాజు సాయి, ఉపసర్పంచ్ పొడిచేటి కిషన్, మండల కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ఆమెర్, వార్డు సభ్యురాలు సయ్యద్ జహెరా గఫూర్, బడుగు రవీందర్, నాయకులు మహమ్మద్ నాసర్, జాడ సంతోష్, ఆముద లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.