Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చౌటుప్పల్రూరల్
చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జెసిఎల్ కు సిఐటియు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ 12 రోజులుగా కంపెనీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. కానీ కంపెనీ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అన్నారు. సంవత్సర కాలంగా వేతన ఒప్పందం కోసం కార్మికులు పోరాటం చేస్తున్న కూడా యాజమాన్యము స్పందించలేదని అన్నారు. జిల్లా కార్మికుల శాఖ అధికారుల సమక్షంలో 10 నెలల నుండి 14 సార్లు యాజమాన్యంతో చర్చలు జరిపిన కూడా వేతనాలు పెంచడానికి అంగీకరించలేదని తెలిపారు. అనివార్య పరిస్థితుల్లో కంపెనీ కార్మికులు గత నెల 22 నుండి సమ్మె చేస్తున్నారని జాయింట్ లేబర్ కమిషనర్ దష్టికి తీసుకువెళ్లారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు మల్లేశం, కంపెనీ యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం తదితరులు ఉన్నారు.