Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు
- కొనసాగుతున్న వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 146 ప్రయివేటు ఆస్పత్రులను తనిఖీ చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు తెలిపారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్య డైరెక్టర్, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు నేతృత్వంలో జిల్లాలోని ప్రయివేటు ఆస్పత్రిల్లో చేపట్టిన తనిఖీలు సోమవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రయివేట్ ఆస్పత్రిలో తనిఖీ కోసం డిప్యూటీ డిఎంహెచ్వో లతో ఆరు తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ బృందాలు జిల్లాలోని ప్రయివేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు ఫిజియోథెరపీ క్లినిక్‌లు, క్లినికల్ ఏ స్పాస్మెంట్ చట్టం 2010 ప్రకారం అనుమతి పత్రాలు, ధరల పట్టిక, డాక్టర్ల ,సిబ్బంది నియామకం మొదలైన వాటిపై తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం 11 ఆస్పత్రులను తనిఖీ చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 146 ప్రయివేటు ఆస్పత్రులను తనిఖీ చేసి, 77 ఆస్పత్రులకు సోకాజ్ నోటీసు జారీ చేసినట్టు వివరించారు. 21 ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేసి చర్యలు చేపట్టినట్లు, మరో 12 హాస్పటలను సీజ్ చేసినట్టు తెలిపారు. 36 హాస్పిటల్ లను ఇర్రెగ్యులారిటీ హాస్పిటల్ గా గుర్తించినట్టు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సమీక్ష
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రిపోర్టింగ్ సూపర్వైజర్లతో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్యారామీటర్లతో ముందు వరుసలో ఉంచాలని సూచించారు. గర్భిణీల నమోదు ప్రక్రియ, మాతా శిశు మరణాలు జరగకుండా సిబ్బంది అందరూ తగు సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పులు పెంచాలని, టిబి, లెప్రసీ వ్యాధులను గుర్తించి సరైన చికిత్సలు అందించాలని సూచించారు. ప్రజలకు వ్యాధులపై సరియైన అవగాహన కల్పించాలని, పుట్టిన బిడ్డను వెంటనే ముర్రుపాలు అందించేటట్లు చర్యలు చేపట్టాలని, టీకాలు వేయించాలని సూచించారు. మలేరియా, డెంగు, బోధకాలు వంటి సీజనల్ వ్యాధులను రాకుండా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని కోరారు. ఎన్ సి డి కార్యక్రమంలో భాగంగా అందరికీ మందులు అందించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో సూపర్వైజర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.