Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో పార్వతీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చింది. తదనంతరం ఆలయం ప్రాంగణంలో జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించి, అమ్మవారు నవరాత్రుల్లో వివిధ రూపాల్లో ధరించినటువంటి వస్త్రాలు, లడ్డూ వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ ఇంతియాజ్ అహ్మద్, ఎంపిటిసి మాదగోని కవిత రామలింగయ్య గౌడ్, మాజీ సర్పంచ్ కట్టంగూర్ యాదగిరి గౌడ్, ఆలయ పూజారులు వావిలాల వేణునాద శర్మ, రామలింగయ్య శర్మ, ఉప సర్పంచ్ గుండ్లపల్లి సైదులు, యూత్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
దేవరకొండ : తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గామాత శోభయాత్ర గురువారం వాసవి మహిళ కోలాటం, చెక్కభజన, నాగపూర్ బ్యాండ్ల ప్రొద్దుటూరుతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, సరస్వతి దేవిగా, గాయత్రీ దేవి, అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చాయి. స్థానిక గాంధీ బజార్ నుండి వివిధ వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. అనంతరం మండలంలోని కొండ భీమనపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు మూరెళ్ళ పవన్, బరు గు రవి, కొరివి నవీన్, అధ్యక్షులు వాసా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుద్దేటి జంగయ్య, కోశాధికారి కొత్త సుబ్బారావు, జిల్లా మాజీ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ ఆ లంపల్లి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
కొండామల్లపల్లి :కొండమల్లేపల్లి పట్టణంలోని సాగర్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు గత పది రోజులుగా పూజల అందుకున్న దుర్గామాత దేవిని గురువారం ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని పల్లకి పైన ఊరేగిస్తూ నిమర్జనానికి తరలించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ ఆలంపల్లి నరసింహ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు పి.మల్లయ్య, శ్రీను, వెంకన్న, గోవిందు, జగతయ్య, కొండమల్లేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు జి. వెంకటేశ్వర్లు, ధనంజయ, పాల్గొన్నారు.