Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు గిఫ్టుగా ఇవ్వాలని ఎల్బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని 17,18 వార్డుల్లోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 17వ వార్డులోని కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాదాని నర్సింహాతోపాటు మరో పది మంది టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధే కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు. కేసీఆర్ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు విఠల్‌రెడ్డి, భావని ప్రవీణ్, లక్ష్మారెడ్డి, మున్సిపల్, మార్కెట్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, చింతల మహిపాల్‌రెడ్డి, తడక అమర్, కిరణ్, భీమిడి రాంరెడ్డి, గంగారామ్, శంకర్, నర్సింహా, వినోద్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.