Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెదురవెల్లి యాదగిరి,ఉప్పరగొని లింగస్వామి ఆధ్వర్యంలో 100 మందికి చెందిన కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వీరందరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారు.ఈ కార్యక్రమంలో పీఏసీిఎస్ చైర్మెన్ జక్కిడి జంగారెడ్డి, మండల అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య,జిల్లా నాయకులు మన్నే ఇంద్రసేనారెడ్డి, కుసుకుంట్ల సత్తిరెడ్డి, జిల్లా యువజన సంఘం నాయకుడు పల్లె గోవర్ధన్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ బిక్షం కార్యదర్శి,ఎడ్ల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.