Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండల వ్యాప్తంగా దసరా పండుగను ప్రజలు గనంగా నిర్వహించారు. బస్వాపురం గ్రామంలో భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ , సర్పంచ్ కస్తూరి మంజుల శ్రీశైలం లువేడుకలో పాల్గొని, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి దసరా వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాడాయి గూడెం, బస్వాపురం గ్రామంలో దుర్గామాత ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్గామాత ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు పాలపిట్ట దర్శనం కోసం రోడ్లపై కలియ తిరిగారు. సాయంత్రం వేళ జమ్మి చెట్టుకు పూజా కార్యక్రమం నిర్వహించి, గ్రామస్తులు కుల మతాలకతీతంగా అలైబాలై కార్యక్రమం నిర్వహించారు. ఒకరినొకరు జమ్మి ఇచ్చి పుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తాజాపూర్ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, చందుపట్ల గ్రామంలో చిన్నం పాండు కొండల్ రెడ్డి, అనంతారం గ్రామంలో సర్పంచ్ చిందమ్ చంద్ర మల్లికార్జున్, ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సర్పంచ్ మాకోలు సత్యం యాదవ్, ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ, తుక్కాపూర్ గ్రామంలో నోముల పద్మ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, వీరవెల్లి గ్రామంలో సర్పంచ్ తంగేళ్ళ పల్లి కల్పనా శ్రీనివాస్, ఎంపీటీసీ కంచి లలితా మల్లయ్య, హనుమాపురం గ్రామంలో సర్పంచ్ ఎడ్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పిన్నం లతా రాజు, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు యాదవ్, నమాత్ పల్లి లో సర్పంచ్ ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్, ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు, బొల్లెపల్లి గ్రామంలో సర్పంచ్ మద్ది బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ గడ్డమీద చంద్రకళ వీరస్వామి గౌడ్, అన్నాజీ పురం గ్రామంలో సర్పంచ్( సిపిఎం నాయకురాలు) ఎదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీల ఫోరం జిల్లా నాయకురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్, కోనూరు గ్రామంలో సర్పంచ్ అంకర్ల మురళీకష్ణ , ఎంపీటీసీ పాశం శివానంద్, వడాయి గూడెం గ్రామంలో గుండు మనిష్ కుమార్ గౌడ్, పెంచికల పహాడ్ గ్రామంలో సర్పంచ్ సిల్వర్ ఎల్లయ్య, జడ్పిటిసి సుబ్బులు బీరు మల్లయ్య , గౌస్ నగర్ గ్రామంలో ఈర్ల పుష్పమ్మ కృష్ణ, బండ సోమరం గ్రామంలో నానం పద్మకృష్ణ గౌడ్ లు, హనుమాపురంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, టిడిపి మండల అధ్యక్షులు ఎర్రబోయిన రమేష్ యాదవ్, తుక్కాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, వడాయి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామి, వడాయి గూడెం గ్రామంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు నల్లమాస శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
దసరా వేడుకల్లో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
పట్టణంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు. రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సుఖశాంతులతో జీవించాలని దుర్గామాత అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కన్సిలర్ గుండగాళ్ల అంజమ్మ, ఎల్లయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీను , భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి , మున్సిపల్చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, వయసు చైర్మన్ చింతల కష్ణయ్య , పాల్గున్నారు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో బుధవారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రావణాసురుని బొమ్మను డీసీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు కాల్చారు. దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలు, చిన్నారులు, మహిళలు, యువతులు నూతన వస్త్రాలు ధరించి జమ్మిచెట్టు వద్దకు చేరుకొని దసరాను ఆనందంగా జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, మార్కెట్, సింగిల్‌విండో చైర్మెన్లు బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు పెద్దిటి బుచ్చిరెడ్డి, దండ అరుణ్‌కుమార్, ముత్యాల భూపాల్‌రెడ్డి, మంచికంటి భాస్కర్, కామిశెట్టి చంద్రశేఖర్, పాలడుగు వెంకటేశం, అన్నెబోయిన గోవిందరాజు, దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, నాంపల్లి రమేశ్, చింతల తిరుమల్‌రెడ్డి, ముత్యాల పాపిరెడ్డి పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : ఆలేరు మండలం సారాజిపేట ,శర్బనపురం గ్రామాలలో విజయదశమి పండుగ పురస్కరించుకొని గడి మైసమ్మ దగ్గర పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ..ఈ సందర్భంగా దుర్గామాత దేవతకు పూజలు నిర్వహించి గడి మైసమ్మ గుడి దగ్గర సొరకాయ కొడుతూ జమ్మి చెట్టు దగ్గర పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు బండ పద్మ పర్వతాలు ,సిరిగిరి అనిత విద్య సాగర్, ఉపసర్పంచ్లు కంతి మహేందర్ ,గడ్డమీది నరేష్, మండల సెక్రటరీ జనరల్ రచ్చ రామ నరసయ్య, సీనియర్ నాయకులు అశోక్ ,సురేష్ ,నవీన్, విజరు తదితరులు పాల్గొన్నారు..
ఆలేరుటౌన్ : మండల కేంద్రంలో ,బహదూర్‌పేట, సయిగూడెం వద్ద బుధవారం విజయదశమి, దసరా పండగ పర్వదిన వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే శ్రీ కనకదుర్గ దేవాలయం తోపాటు శివాలయం ,రంగనాయక ఆలయం ,ఆంజనేయ,రామ ఆలయాలను సందర్శించి, దర్శించుకున్నారు. సాయంత్రం షమీ జమ్మిపూజ , మున్నూరు కాపు సంఘం, శ్రీ కనకదుర్గ దేవాలయం , కుర్మసంఘం, ఇతర సంఘా భవనాల వద్ద జామి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు . శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద రావణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య , కనకదుర్గ ఆలయ చైర్మెన్కొలుపుల హరినాథ్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఎలుగల స్వామి ,పి శ్రీనివాస్ ఆంజనేయులు, రాంబాబు, రాములు, పాపయ్య ,కుమారస్వామి ,శ్రీనివాసు, చందర్ ,జగన్ ,మహేందర్ ,సత్యనారాయణ, శ్రీకాంత్ ,ప్రజాప్రతినిధులు , కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.