Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల అధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి
- ఎన్నికలకు అనర్హుడుగా గుర్తించాలని నిరసన
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి రాజగోపాల్రెడ్డి తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండ పురుషోత్తం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదేళ్ల పదవికి రాజీనామా చేసి బీజేపీకి అమ్ముడుపోయారని, మునుగోడులో పోటీకి అనర్హుడుగా ఎన్నికల అధికారులు గుర్తించాలని శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్లేకర్లతో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిచిన మూడు నెలలకే బీజేపీ అమ్ముడుపోయానని ఓ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూనే ప్రత్యేక సాక్ష్యమని, దీన్ని ఎన్నికల అధికారులు గమనించి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరన్నారు. తను అమ్ముడుపోయినదే కాకుండా ప్రజా ప్రతినిధులను నాయకులను కొనుగోలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ను విమర్శించే అర్హత లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ మరోసారి విమర్శకు పునరావతం అయితే తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శీను ప్రజాపతి, పట్టణ అధ్యక్షులు రావిరాల కుమారస్వామి, జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మెన్ జానయ్యయాదవ్, సూర్యాపేట జెడ్పీటీసీ జీడి బిక్షం, ఎంపీటీసీలు ఈద నిర్మల శరత్ బాబు, వనం యాదయ్య, మండల సోషల్ మీడియా కన్వీనర్ బండారి వెంకన్న, టీఆర్ఎస్ యువజన నాయకులు ఏరుకొండ నాగరాజు, జీడిమడ్ల జలంధర్, పెరమళ్ళ ప్రణరు, తదితరులు పాల్గొన్నారు.